తెలంగాణ

telangana

ETV Bharat / business

సోమవారం నుంచి 24 గంటలూ ఆర్​టీజీఎస్​ - ఆర్​టీజీఎస్​ అంటే ఏమిటి

తక్షణ నగదు బదిలీ వ్యవస్థ అయిన రియల్​ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్ (ఆర్​టీజీఎస్)పై ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ కీలక ప్రకటన చేశారు. ఈ అర్ధ రాత్రి నుంచి ఈ సేవలు 24x7 అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

rtgs 24 hrs from tomorrow
ఇకపై 24 గంటలూ ఆర్​టీజీఎస్​

By

Published : Dec 13, 2020, 1:33 PM IST

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్(ఆర్​టీజీఎస్​) సేవలు సోమవారం (డిసెంబర్ 14) నుంచి 24x7 అందుబాటులోకి రానున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ అర్ధ రాత్రి 12:30 గంటల నుంచి ఇది అమలులోకి రానున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

ఆర్​టీజీఎస్​ అంటే?

ఆర్​టీజీఎస్​ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే.. తక్షణమే నగదు బదిలీ అవ్వడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

ఇదీ చూడండి:ద్రవ్యోల్బణం లెక్కలు, ఫెడ్ ప్రకటనలే కీలకం!

ABOUT THE AUTHOR

...view details