తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులతో ఉపాధి సృష్టి' - Impact of Budget 2020

మౌలిక సదుపాయాల కల్పన, వస్తు రవాణా విధానంపై పూర్తి దృష్టి సారిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టంచేశారు. మౌలిక వసతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు విత్తమంత్రి.

BUD-INFRA
BUD-INFRA

By

Published : Feb 1, 2020, 2:38 PM IST

Updated : Feb 28, 2020, 6:47 PM IST

'ఆ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులతో ఉపాధి సృష్టి'

అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనను కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇందుకోసం జాతీయ మౌలిక వసతుల పైప్​లైన్​ ప్రారంభించామన్నారు.

"వచ్చే ఐదేళ్లలో 100 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇందుకోసం 103 లక్షల కోట్లతో 2019 డిసెంబర్​ 31న జాతీయ మౌలిక వసతుల పైప్​లైన్​ (ఎన్​ఐపీ)ని ఆవిష్కరించాం. ఈ ప్రాజెక్టులో గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్​, ఆరోగ్యం, ఆధునిక రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో బస్సులు, వస్తు రవాణా తదితరాలు భాగంగా ఉంటాయి. "

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ఎన్​ఐపీతో ప్రతి పౌరుని జీవనం మెరుగుపడుతుందని సీతారామన్​ తెలిపారు. సాధారణంతో పాటు ప్రత్యేక రంగాల్లో సంస్కరణలు వస్తాయని.. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు.

త్వరలో వస్తురవాణా విధానాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

"త్వరలో జాతీయ వస్తు రవాణా విధానాన్ని తీసుకొస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా నిబంధనలు ఉంటాయి. ఇది సింగిల్​ విండో ఈ-లాజిస్టిక్స్​ మార్కెట్​ను సృష్టిస్తుంది. ఎంఎస్​ఎంఈ రంగాలకు దోహదంగా ఉంటుంది."

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ఎగుమతుల హబ్​ కోసం నిర్విక్​

దేశీయ మొబైల్‌ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీతారామన్​ స్పష్టం చేశారు. లక్షా 3 వేల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్నారు. జౌళిరంగానికి రూ.1480 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

Last Updated : Feb 28, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details