తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ నెల 14 నుంచి ఆర్​టీజీఎస్ 24x7 - ఆర్​జీజీఎస్​ నగదు బదిలీ సమయం

పెద్ద మొత్తాల్లో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్​టీజీఎస్ సేవలపై ఆర్​బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి ఆర్​టీజీఎస్​ 24x7 పని చేయనున్నట్లు తెలిపింది.

rgts become 24x7 from December 14
డిసెంబర్ 14 నుంచి 24 గంటలూ ఆర్​టీజీఎస్

By

Published : Dec 10, 2020, 5:17 AM IST

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్(ఆర్​టీజీఎస్​) సేవలు ఈ నెల 14 నుంచి 24x7 అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్​బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్ల‌డించింది.

ఏమిటి ఈ ఆర్​టీజీఎస్​..

ఆర్​టీజీఎస్​ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే.. తక్షణమే నగదు బదిలీ అవ్వడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

భారీ మొత్తంలో నగదు బదిలీకి మరో వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది అదే నెఫ్ట్. ఈ వ్యవస్థను కూడా గత ఏడాది డిసెంబర్​ 16 నుంచి 24x7 అందుబాటులోకి తెచ్చింది ఆర్​బీఐ. ఈ వ్యవస్థలో కనీస పరిమితులు ఉండవు. దీని ద్వారా గంటలోపు నగదు బదిలీ పూర్తవుతుంది.

ఇదీ చూడండి:ఆ నిబంధనలతో టేక్​ హోం శాలరీలో కోత?

ABOUT THE AUTHOR

...view details