తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.15 లక్షల కోట్ల మేర జీడీపికి ముప్పు! - జీడీరీ తాజా అంచనాలు

వచ్చే పదేళ్ల కాలంలో దేశ జీడీపీకి భారీ ముప్పు వాటిల్లనుందని మెకిన్సే గ్లోబల్​ నివేదికలో వెల్లడైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా బయట పనిచేసే కార్మికుల పనిగంటలు తగ్గడం వల్ల సుమారు 200 బిలియన్​ డాలర్ల నష్టం జరగనుందని పేర్కొంది.

Rising temperatures will force workers to stay indoors, poses $200 bn risk to GDP by 2030: Report
రూ.15 లక్షల కోట్ల మేర జీడీపికి ఉక్కపోత!

By

Published : Nov 26, 2020, 7:53 AM IST

వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి భారత జీడీపీకి 200 బిలియన్ (సుమారు రూ. 15లక్షల కోట్లు) ముప్పు వాటిల్లవచ్చని మెకిన్సే గ్లోబల్​ ఇన్​స్టిట్యూట్​ నివేదిక వెల్లడించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల బయట పనిచేసే కార్మికుల పనిగంటలు తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే 2030కి బయట పనిచేసే వారికి అభద్రత 15శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 2017లో ఎండలో పనిచేసే పనివాటా జీడీపీలో సగభాగమని, జీడీపీ వృద్ధిని ఈ విభాగం 30శాతం పెంచిందని, దాదాపు 75శాతం కార్మిక శక్తి లేదా 38 కోట్ల మంది ఈ విధంగానే ఉపాధి పొందుతున్నారని వివరించింది మెకిన్సే.

నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా...

  • ఎండ వేడి, ఉక్కపోత పెరగడం వల్ల పనిగంటలు కోల్పోతే 2030కి జీడీపీలో 2.5- 4.5 శాతం నష్టం రావొచ్చు. దీనివల్ల దాదాపు 150-250 బిలియన్​ డాలర్లని అంచనా.
  • భారత్​లో దాదాపు 16- 20 కోట్ల మంది ప్రజలు వార్షికంగా 5శాతం పెరుగుదల వేడిని తట్టుకునే అవకాశం ఉంది.
  • ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల బయట పనిచేసే కార్మికుల పనిగంటలను భారత్​లో మార్చాల్సిన అవసరం ఉంటుంది.
  • కార్మికుల పనిగంటలు తగ్గడం సహా.. భారత వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి:27న డీబీఎస్​లో లక్ష్మీ విలాస్​ బ్యాంక్​ విలీనం

ABOUT THE AUTHOR

...view details