చిల్లర ధర ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.62 శాతానికి పెరిగి 16 నెలల గరిష్ఠానికి చేరినా.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం తగ్గుదలే నమోదుచేసిందని కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. అక్టోబర్‌లో టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. కాస్త తగ్గి 0.16 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఈ సూచీ 0.33 శాతంగా ఉంది. ప్రధానంగా తయారీ రంగ వస్తువులు సహా ఆహారేతర వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని వెల్లడించింది కేంద్ర గణాంకాల శాఖ.
'చిల్లర' పెరిగినా 'టోకు' ద్రవ్యోల్బణం తగ్గింది
ఈ ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర గణాంకాలశాఖ వెల్లడించింది. తయారీ రంగ వస్తువులు సహా ఆహారేతర వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
'చిల్లర' పెరిగింది.. 'టోకు' ద్రవ్యోల్బణం తగ్గింది
2018 అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. 5.54 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో ఆహార పదార్థాల ధరలు 9.80 శాతం పెరిగితే.. ఆహారేతర వస్తువుల ధరలు 2.35 శాతం ఎగబాకాయి. తయారీ రంగ వస్తువుల ధరలు... 0.84 శాతం తగ్గాయి.
ఇదీ చూడండి : బ్యాంకింగ్‌లోకి గూగుల్... త్వరలో చెకింగ్ ఖాతా సేవలు!