చిల్లర ధరల ద్రవ్యోల్బణ నవంబర్లో భారీగా పెరిగింది. మూడేళ్లలో అత్యధికంగా 5.54 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరల్లో వృద్ధి రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తోంది.
వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ).. అక్టోబర్లో 4.62 శాతంగా ఉండగా.. గత ఏడాది పదో నెలలో 2.33 శాతంగా మాత్రమే నమోదు కావటం గమనార్హం.
జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం.. నవంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. అక్టోబర్లో ఇది 7.89 శాతంగా ఉంది.