రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 7.34 శాతానికి పెరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించింది.
సీపీఐ ఆగస్టులో 6.69 శాతంగా నమోదవ్వగా.. 2019 సెప్టెంబర్లో 3.99 శాతంగా ఉండటం గమనార్హం.