తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం- నవంబర్​లో 4.91శాతం

retail inflation rate in november 2021: నవంబర్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం 4.91శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం.

retail inflation rate in november 2021
మళ్లీ పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం- నవంబర్​లో 4.91శాతం

By

Published : Dec 13, 2021, 6:03 PM IST

Updated : Dec 13, 2021, 6:10 PM IST

retail inflation rate in november 2021: దేశంలో రిటైల్​ ద్రవ్యోల్బణం(సీపీఐ) స్వల్పంగా పెరిగింది. గత నెలలో సీపీఐ 4.91 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం.

ఎన్​ఎస్​ఓ ప్రకారం.. నవంబర్​లో ఆహార ద్రవ్యోల్బణం 1.87శాతంగా ఉంది. అక్టోబర్​లో అది 0.85శాతం మాత్రమే. 2021 అక్టోబర్​లో సీపీఐ 4.48శాతం. గతేడాది నవంబర్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం 6.93గా నమోదైంది.

2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం వరకు రిటైల్​ ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్​బీఐ(రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) అంచనా వేసింది. ఆ తర్వాత దిగొస్తుందని పేర్కొంది.

ఇదీ చూడండి:-'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్​ వ్యవస్థలో సంస్కరణలు'

Last Updated : Dec 13, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details