నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్న వేళ 2019 డిసెంబర్ నెలలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2019 నవంబర్‌లో 5.54 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో ఏకంగా 7.35 శాతానికి ఎగబాకింది. 2014 జూలైలో నమోదైన 7.39 తర్వాత ఇదే అత్యధికం.
2018 డిసెంబర్‌లో చిల్లర ధరల సూచీ 2.11 శాతంగానే ఉంది. ఈ మేరకు కేంద్ర గణాంక శాఖ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో మైనస్ 2.65 శాతం ఉంటే 2019 డిసెంబర్‌లో 14.12 శాతానికి పెరిగింది. 2019 నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. 2018 డిసెంబర్‌తో పోలిస్తే 2019 డిసెంబర్‌లో కూరగాయల ఆధారిత ద్రవ్యోల్బణం 60.5 శాతం పెరిగింది. పప్పులు, తృణధాన్యాల ద్రవ్యోల్బణం 15.44 శాతంగా నమోదు కాగా... మాంసం, చేపల ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది.