మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. ఆహార ధరలు తగ్గడం వల్ల ఈ నెలలో 5.91 శాతానికి పరిమితమైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మార్చిలో దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం - క్షీణించిన టోకు ధరల ద్రవ్యోల్బణం
మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. వినియోగదారు ధరల సూచీ 5.91 శాతానికి పరిమితమైంది. ఆహార ద్రవ్యోల్బణం 8.76 శాతంగా నమోదైంది.
గత నెలలో 10.81 శాతంగా నమోదైన ఆహార ద్రవ్యోల్బణం.. మార్చిలో 8.76 శాతానికి క్షీణించింది. కూరగాయలు, గుడ్లు, మాంసం ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.
ద్వైమాసిక పరపతి విధానాన్ని రూపొందించడంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని భారత రిజర్వు బ్యాంకు కీలకంగా పరిగణిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి(2 శాతం అటూ ఇటూగా) పరిమితం చేయాలని ఆర్బీఐని కోరింది కేంద్రం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిమితులకు లోబడే ఉండడం గమనార్హం.