చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) జులైలోనూ పెరిగింది. జులైలో 6.93 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో తెలింది. ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగటమే ఇందుకు ప్రధానంగా కారణమని వెల్లడైంది.
ఇదే సంవత్సరం జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.23 శాతంగా, ఆహార ద్రవ్యోల్బణం 8.72 శాతంగా ఉండటం గమనార్హం.