తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ - రెపో రేటు

Though previous actions have been on expected lines in terms of the accommodative stance RBI took after economic growth took a major hit in the country following the Covid-19 outbreak, this time the analysts look quite divided on the central bank’s next possible move.

Rbi on Repo rate
రెపో రేటుపై ఆర్​బీఐ ప్రకటన

By

Published : Aug 6, 2020, 11:15 AM IST

Updated : Aug 6, 2020, 12:42 PM IST

12:39 August 06

యథాతథ స్థితికే మొగ్గు..

కీలక వడ్డీ రేట్లను.. రిజర్వు బ్యాంక్​ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ సారి యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. దీనితో రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా వద్ద కొనసాగనున్నాయి.

వృద్ధికి ఊతమందించేందుకు వడ్డీ రేట్లు యథాతథంగానే ఎంపీసీ సభ్యులు మొగ్గు చూపినట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. మార్జినల్‌ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతం వద్ద ఉంటుందని పేర్కొన్నారు. వృద్ధికి పెరుగుదలకు భవిష్యత్​లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్నారు దాస్​. కరోనా వల్ల ఆశించిన వృద్ధి నమోదు కాలేదని, అయినా ద్రవోల్బణం అదుపులోనే ఉందని వివరించారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అత్యవసర సమావేశాలు నిర్వహించి 115 బేసిస్​ పాయింట్ల మేర రెపో తగ్గించింది ఆర్​బీఐ.

12:12 August 06

  • ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియా సమావేశం
  • వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
  • రెపో రేటు, రివర్స్‌ రెపో రేటు యథాతథం
  • రెపో రేటు యథాతథంగా 4 శాతం ఉంచిన ఆర్‌బీఐ
  • రివర్స్‌ రెపో రేటు యథాతథంగా 3.35 శాతంగా ఉంచిన ఆర్‌బీఐ
  • బ్యాంకు రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు యథాతథం
  • బ్యాంకు రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతం

11:25 August 06

మళ్లీ రేట్ల తగ్గింపు?

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల సమావేశం అనంతరం గురువారం సమీక్ష నిర్ణయాలు వెల్లడించనున్నారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్.

ఈ సమీక్ష నిర్ణయాల్లో రెపో రేటు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. రిటైల్​ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతలను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తగ్గించే అవకాశం..

అయితే ద్రవ్యోల్బణం పెరిగినా వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని మరో రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..

ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్​బీఐ. కరోనా కారణంగా నగదుకు ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.

రెండు సార్లు వడ్డీ తగ్గింపుతో రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

వీటికి తోడు రుణాల పునర్​వ్యవస్థీకరణ సహా మరిన్ని అంశాలను పరిశీలించమని పరిశ్రమ వర్గాల నుంచి ఆర్​బీఐకి వినతులు వస్తున్నాయి.

10:45 August 06

ఎంపీసీ సమావేశంపై భారీ అంచనాలు..

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. కరోనా సంక్షోభం సహా జూన్​లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన నేపథ్యంలో గురువారం వెలువడనున్న సమీక్ష నిర్ణయాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉదయం 11:45 గంటలకు శక్తికాంత దాస్ సమీక్ష నిర్ణయాలు వెల్లడించనున్నారు.

రెపో రేటు తగ్గింపు సహా.. మరిన్ని కీలక అంశాలు ఈ సారి ఎంపీసీ చర్చలో ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెపో రేటుపై మిశ్రమ అంచనాలు వస్తున్నాయి. రెపో యథాతథంగా ఉండొచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే.. కొందరు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Last Updated : Aug 6, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details