తెలంగాణ

telangana

ETV Bharat / business

మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు

బెంగళూరులోని శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​ లావాదేవీలపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఆంక్షలు విధించింది. విత్​డ్రా పరిమితిని రూ.35వేలుకు పరిమితం చేసింది. ఈ పరిణామంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Reserve Bank of India (RBI) has restricted on Sri Guru Raghavendra Co-operative Bank business transactions
మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు

By

Published : Jan 14, 2020, 1:23 PM IST

Updated : Jan 14, 2020, 11:06 PM IST

మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు

బెంగళూరులోని శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​పై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ​వ్యాపారపరమైన ఆంక్షలు విధించింది. నగదు ఉపసంహరణ పరిమితిని రూ .35 వేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.

శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​పై ఆంక్షల విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. ఆంక్షలకు లోబడి రూ.35వేలు విత్​డ్రా చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

"నా భర్త ఈ బ్యాంక్​లో రూ .15-20 లక్షల వరకు జమ​ చేశారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ పొందారు. మాకు ఆ డిపాజిట్​పై వచ్చే వడ్డీనే ఆధారం. బ్యాంక్​పై ఆంక్షలు విధించారనే వార్త వినగానే ఆందోళనకు గురయ్యాం. ఇక్కడికి వచ్చి బ్యాంకు సలహాదారుడిని కలిస్తే.. మా డబ్బు భద్రమని చెప్పారు. అయితే మొత్తం ఇవ్వడానికి ఆరు నెలల గడువు అడిగారు. అయినా మాకు భయంగానే ఉంది."

- తార, ఖాతాదారురాలు

Last Updated : Jan 14, 2020, 11:06 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details