ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ప్రభుత్వం ముగ్గురు నూతన స్వతంత్ర సభ్యులను నియమించిన తర్వాత.. భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) సమీక్ష బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల భేటీ అనంతరం అక్టోబర్ 9న ఎంపీసీ సమీక్ష నిర్ణయాలు వెల్లడించనుంది ఆర్బీఐ.
ఈ సారి సమీక్షపై అంచనాలు..
రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ సారి రెపో రేటును యథాతథంగా ఉంచేందుకు ఎంపీసీ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ పెట్టుకున్న అంచనాలకు మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైన కారణంగా ఆగస్టు సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఎంపీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.