తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ లెక్కలు లేవు:ఆర్బీఐ - ఆర్​టీఐ

రద్దుచేసిన పాత 500,1000 నోట్లు పెట్రోల్​ పంపుల్లో ఏ మేరకు వినియోగించారనే సమాచారం తమ వద్ద లేదని ఆర్​బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన దరఖాస్తుకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

ఆర్బీఐ

By

Published : Mar 10, 2019, 3:40 PM IST

పెద్ద నోట్ల రద్దు తర్వాత రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు పెట్రోల్​ పంపుల్లో ఏ మేరకు వినియోగించారనే సమాచారం తమ వద్ద లేదని రిజర్వు బ్యాంకు తెలిపింది. సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సమాధానమిచ్చిన ఆర్​బీఐ ఈ వివరాలు వెల్లడించింది.

2016 నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్చుకునేందుకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది ఆర్బీఐ. అందులో భాగంగా సేవా రంగంలో రుసుముల చెల్లింపుల ద్వారా నోట్ల చెలామణికి అవకాశం కల్పించింది. అంటే తాత్కాలికంగా పలు సేవా రంగాల్లో చెల్లింపులకు పాత నోట్లు వాడేందుకు వీలు కల్పించింది. ఇందులో పెట్రోల్​ పంపులు కూడా ఉన్నాయి.

2016 నవంబరు 25 తర్వాత రూ.500 మాత్రమే సేవారంగాల్లో లావాదేవీలకు చెలామణి అవుతాయని షరతు విధించింది. 2016 డిసెంబర్ 2 తర్వాత రూ.500 నోటును సేవారంగాల్లో వాడేందుకు వీళ్లేదని ప్రభుత్వం పేర్కొంది.

ఈ నేపథ్యంలో పెట్రోల్​ పంపుల్లో వినియోగమైన పాత నోట్ల వివరాలు కోరుతూ అందిన దరఖాస్తుకు రిజర్వు బ్యాంక్ సమాధానమిచ్చింది.

ఈ సమాచారంతో పాటు బీమా చెల్లింపులకు ఎంత మొత్తంలో పాత నోట్లు వినియోగమయ్యాయనే సమాచారం కూడా తమ వద్ద లేదని ఆర్బీఐ తెలిపింది. దీనిపై సమాచారం తెలుసుకునేందుకు ఇన్స్యూరెన్స్​ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్​ ఇండియా(ఐఆర్​డీఏఐ)కు ఆర్​టీఐ దరఖాస్తును పంపినట్లు పేర్కొంది.

స్పందించిన ఐఆర్​డీఏఐ పాలసీల కొనుగోలుకు వినియోగించిన పాత నోట్ల వివరాలు లేవని సమాధానమిచ్చింది. వాటి నిర్వహణ బాధ్యత అథారిటీది కాదని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details