ఆరుగురు సభ్యుల రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ నేడు ప్రారంభం కానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈ నెల 4న ఉదయం 11.45 గంటలకు వెలువరించనుంది కమిటీ.
రెపోరేటు లాంటి కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక వేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన క్రితం సమీక్షలో ఎనిమిది నెలల అనంతరం వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. మళ్లీ తగ్గించినట్లయితే ఆర్థిక రుణ స్వీకర్తలకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.