ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష మంగళవారం ప్రారంభం కానుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి 6 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ద్వైమాసిక సమీక్షలో అనేక అంశాలపై చర్చ జరగనుంది. 6వ తేదీన వెలువడే సమీక్ష నిర్ణయాల్లో.. రెపో రేటు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..
ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. కరోనా కారణంగా నగదుకు ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.