తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ రెపో రేటు మరోసారి తగ్గింపు! కారణాలివే.. - రెపో వడ్డీ రేటు తగ్గింపు

ఆర్థిక స్థిరత్వం సహా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన నేపథ్యంలో మరోసారి ఆర్​బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆర్​బీఐ రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా ఉండగా.. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

rbi repo rate cut
ఆర్​బీఐ రెపో రేటు తగ్గింపు

By

Published : Jul 27, 2020, 10:14 AM IST

కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి తగ్గించనుందా? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఉతమివ్వడం సహా.. జూన్​లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల జరగనున్న ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపో రేటు తగ్గింపు దిశగానే నిర్ణయాలు ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

ఆగస్టు 4 నుంచి ఆర్​బీఐ ఎంపీసీ సమీక్ష ప్రారంభం కానుంది. కీలక వడ్డీ రేట్లపై 6వ తేదీన నిర్ణయం వెలువడనుంది.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అత్యవసర సమీక్ష ద్వారా వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్​బీఐ. మొదట మార్చిలో, తర్వాత మేలో సమీక్షలు నిర్వహించి మొత్తం 115 బేసిస్​ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్​బీఐ.

ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

మరోసారి తగ్గింపునకు కారణాలు..

ఇప్పటికే కీలక వడ్డీ రేట్లు తగ్గించిన.. ఆర్థిక వ్యవస్థ ఇంకా సంక్షోభం వల్ల ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీనికి తోడు జూన్​లో చిల్లర ద్రవ్యోల్బణం 6.09 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు భారీగా పెరగటం ఇందుకు ప్రధాన కారణం. చిల్లర ద్రవ్యోల్బణం 4 శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వం, ఆర్​బీఐలు పరిమితులు పెట్టుకున్నాయి. సాధారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల అధారంగానే రెపో రేటును నిర్ణయిస్తుంటుంది ఆర్​బీఐ.

ఈ కారణాలన్నింటి నేపథ్యంలో ఆగస్టులో జరగనున్న ఎంపీసీ సమావేశంలో 25 బేసిస్​ పాయింట్ల వడ్డీ తగ్గింపు ఉండొచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త అదిత్ నాయర్​ అంచనా వేస్తున్నారు. రివర్స్ రెపో రేటు 35 బేసిస్​ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్​కిరణ్ రాయ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 25 బేసిస్ పాయింట్ల రెపో తగ్గింపు ఉండొచ్చని తెలిపారు. అయితే రేట్లు యథాతథంగా ఉంచేందుకూ అవకాశాలు లేకపోలేవని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:టాటా స్టీల్ యూకే ప్లాట్​లో బ్రిటన్​కు సగం వాటా!

ABOUT THE AUTHOR

...view details