ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరిన ఆర్థిక వృద్ధిరేటును పెంచడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంకు వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈనెల 3-5 మధ్య జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్, మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ప్రతి ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉన్నారు. 2019లో ఇప్పటి వరకూ 5సార్లు వడ్డీరేట్లను సవరించారు. మొత్తం 135 బేసిస్ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్బీఐ.