తెలంగాణ

telangana

ETV Bharat / business

జూన్​లో వడ్డీ రేట్ల కోత? ఆ తర్వాత కష్టమే! - ఐహెచ్​ఎస్​ మార్కిట్

జూన్​లో జరిగే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు 'ఐహెచ్​ఎస్ మార్కిట్'​ అంచనా వేసింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్ సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ.

ఆర్బీఐ

By

Published : May 8, 2019, 5:33 PM IST

రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను జూన్​లో మరోసారి తగ్గించే అవకాశం ఉన్నట్లు లండన్​ కేంద్రంగా పని చేస్తున్న 'ఐహెచ్ఎస్ మార్కిట్​' అంచనా వేసింది.

అంతర్జాతీయ వృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాలు, ఆర్బీఐ లక్ష్యం కన్నా దేశీయ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.

ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్​ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు చొప్పున తగ్గించింది ఆర్బీఐ. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రానున్న నెలల్లో వర్షపాతం సాధారణంగా కంటే కాస్త తక్కవగా ఉంటుందని.. ఈ కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరగొచ్చని నిపుణుల విశ్లేషణ.

ఫలితంగా 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో ఆర్థ భాగంలో ద్రవ్యోల్బణం 5 శాతాన్ని దాటొచ్చని అంచనా. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ తర్వాత మరోసారి రేట్ల కోతకు ఆర్బీఐ మొగ్గుచూపడం కష్టమేనని ఐహెచ్​ఎస్​ నివేదిక పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details