తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్​బీఐ రూ.50వేల కోట్ల ప్యాకేజీ - ఆర్​బీఐ గవర్నర్​ వార్తలు

ఆర్థిక వ్యవస్థను కరోనా సంక్షోభం దిశగా నడిపిస్తోన్న వేళ ఆర్​బీఐ మరోసారి కీలక ఉద్దీపన చర్యలను ప్రకటించింది. సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్లు అందించనున్నట్లు ప్రకటించారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్. రివర్స్‌ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

rbi
ఆర్​బీఐ

By

Published : Apr 17, 2020, 10:43 AM IST

భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఆర్​బీఐ కీలక ప్రకటనలు చేసింది. రివర్స్​ రెపోరేటు తగ్గింపు తగ్గింపు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, నాబార్డు, జాతీయ హౌసింగ్​ బోర్డ్​కు భారీ సాయం ప్రకటించింది. ఆర్​బీఐ గవర్నర్​ ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఆర్​బీఐ గవర్నర్​ ప్రెస్​మీట్​ హైలైట్స్​:

రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ 2.0

  • కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ 2.0.
  • ఆర్​బీఐ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు విడుదల. నాబార్డ్, సిడ్బీ, ఎన్​హెజ్​బీ వంటి ఆర్థిక సంస్థలకు రుణాల రూపంలో అందజేత.
  • రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 4శాతం నుంచి 3.75శాతానికి చేరిన ఆర్​ఆర్​ఆర్​.
  • రెపో రేటు యథాతథం.

శక్తికాంత దాస్​ భరోసా

  • కరోనా సంక్షోభంతో ఏర్పడ్డ పరిస్థితుల్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
  • కరోనా సంక్షోభం ఉన్నా సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చొరవ చూపాలి.
  • భారత్​ 1.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఐఎంఎఫ్​ అంచనా. మొత్తం జీ20 దేశాల్లో ఇదే అత్యధికం కావడం సంతృప్తికర అంశం.
  • 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఐఎంఎఫ్​ అంచనాల బట్టి ఈ విషయం అర్థమవుతోంది. 7.4శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం.
  • మార్చిలో వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. విద్యుత్ డిమాండ్ భారీగా క్షీణించింది.
  • 2008-09 ఆర్థిక మాంద్యాన్ని మించిన స్థాయిలో మార్చిలో ఎగుమతులు 34.6శాతం మేర తగ్గాయి.
  • లాక్​డౌన్​ వేళ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ డౌన్​టైమ్​ లేదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి.
  • ద్రవ్య లభ్యత సరిపడా ఉండేలా చూసేందుకు, రుణ మంజూరు సజావుగా సాగేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు త్వరలో చర్యలు.

ABOUT THE AUTHOR

...view details