తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రైవేటీకరణపై రఘురాం రాజన్​ కీలక సూచనలు

ఒక మొండి బకాయిల సమస్యలు పరిష్కరించేందుకు ఒక 'మొండి బ్యాంకు'ను ఏర్పాటు చేయాలన్నారు ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్. ప్రైవేటీకరణ, ఆర్థిక సేవల విభాగం, సంస్కరణలు సహా పలు విషయాలపై సర్కార్​కు కీలక సూచనలు చేశారు.

By

Published : Sep 22, 2020, 7:27 AM IST

RBI EX GOVERNOR RAGHURAM RAJAN INTREVIEW
ప్రైవేటీకరణపై సర్కార్​కు రఘురాం రాజన్​ కీలక సూచనలు

ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రభుత్వానికి సూచించారు. ఒక మొండి బకాయిలను సమస్యలు పరిష్కరించేందుకు ఒక 'మొండి బ్యాంకు'ను సైతం ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యతో కలిసి 'ఇండియన్‌ బ్యాంక్స్‌: ఎ టైమ్‌ టు రిఫామ్‌' అనే చర్చాపత్రంలో రాజన్‌ పలు సూచనలు చేశారు.

అవేంటంటే..

ప్రైవేటీకరణపై..:

ఆర్థిక - సాంకేతిక అనుభవం ఉన్న ప్రైవేటు పెట్టుబడుదార్లను ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ఆహ్వానించాలి. కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం వాటిలో వాటాలు దక్కించుకోకుండా చూడాలి. విరుద్ధ ప్రయోజనాలు కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం తన వాటాను 50 శాతం కంటే దిగువకు తీసుకువస్తే.. బ్యాంకు కార్యకలాపాలకు, ప్రభుత్వానికి దూరం పెరుగుతుంది. పాలన మెరుగవుతుంది.

ఆర్థిక సేవల విభాగంపై..:

బ్యాంకు రుణాల విషయంలో ఆర్‌బీఐ నుంచి గొప్ప అధికారాన్ని పొందిన ప్రభుత్వం.. ఆ అధికారాన్ని ఒక్కోసారి ప్రజా లక్ష్యాలను చేరేందుకు.. మరికొన్ని సార్లు ఆర్థిక సంఘటితానికి.. ఇంకొన్నిసార్లు పారిశ్రామికవేత్తలను నియంత్రణలోకి తెచ్చుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగ పాత్రను తగ్గించుకుంటూ పోవాలి. అపుడే బ్యాంకు బోర్డులకు, యాజమాన్యానికి స్వాతంత్య్రం లభిస్తుంది. ప్రైవేటు ఆస్తుల నిర్వహణ, జాతీయ ఆస్తుల నిర్వహణ కోసం సమాంతరంగా మొండి బ్యాంకులనూ ప్రోత్సహించాలి.

సంస్కరణలపై..:

నియంత్రణ, మార్కెట్‌ సంస్కరణలతో పాటు.. బ్యాంకు పాలన, యాజమాన్యం విషయంలోనూ సంస్కరణలు జరగాలి. మొండి బకాయిల విషయంలో కోర్టు బయటి పునర్నిర్మాణ అవకాశాలను పరిశీలించాలి. ఒత్తిడిలో ఉన్న కంపెనీకి అప్పులిచ్చిన రుణదాతలతో చర్చలు జరపాలి. అవి విఫలమైతేనే ఎన్‌సీఎల్‌టీకి వెళ్లాలి.

బ్యాంకింగ్‌ లైసెన్సులపై..:

బ్యాంకు లైసెన్సు దరఖాస్తులకు ఎల్లపుడూ ఆహ్వానం ఉండాలి. అపుడు మెరుగైన బ్యాంకులు ఆవిర్భవిస్తాయి. అధిక పనితీరు ప్రదర్శించే చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకులుగా మారతాయి. అదే సమయంలో పనితీరు సరిగా లేని పెద్ద బ్యాంకులను చిన్న బ్యాంకులుగా మార్చాలి.

ABOUT THE AUTHOR

...view details