తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు - 'కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం- ఆర్థిక చర్యలకు సిద్ధం'

కరోనా ప్రభావం నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రిజర్వ్​ బ్యాంక్ స్పష్టంచేసింది. ప్రపంచంతో పాటు భారత్​లో వైరస్​ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

RBI estimating the corona effect on indian economy
'కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం- ఆర్థిక చర్యలకు సిద్ధం'

By

Published : Mar 3, 2020, 3:45 PM IST

కరోనా వైరస్​ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక విపణి కార్యకలాపాలు కొనసాగేలా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని తెలిపింది.

"ప్రపంచంతో పాటు దేశీయ పరిణామాలను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. నమ్మకాన్ని కొనసాగిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరిచేందుకు కృషి చేస్తాం."

- ఆర్బీఐ ప్రకటన

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. భారత్​లోనూ ఈ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్బీఐ సమన్వయ విధాన పాలసీపై అంచనాలతో ఇవాళ మార్కెట్ సెంటిమెంట్​ బలపడింది.

విస్తరిస్తోన్న కరోనా..

చైనాలో మొదలైన కరోనా వైరస్​ ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

భారత్​లోనూ తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇటలీ, ఇరాన్​, దక్షిణకొరియా, జపాన్​ జాతీయులకు సాధారణ, ఈ వీసాలను రద్దు చేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి:'సజీవ సమాధి'తో రాజధాని రైతులు నిరసన

ABOUT THE AUTHOR

...view details