తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశలు దాటి వడ్డీ కోత.. తగ్గిన జీడీపీ అంచనా - ఆర్బీఐ

వృద్ధికి ఊతమందించే దిశగా 35 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గించింది ఆర్బీఐ. రెపో రేటు తగ్గించడం వరుసగా ఇది నాలుగో సారి.

ఆశలు దాటి వడ్డీ కోత.. తగ్గిన జీడీపీ అంచనా

By

Published : Aug 7, 2019, 10:39 PM IST

రెపో రేటు తగ్గింపుపై బ్యాంకింగ్ రంగ నిపుణుడు రమణ అభిప్రాయం

అందరి అంచనాలకు మించి రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల చర్చల అనంతరం ఈ కీలక ప్రకటన చేసింది. ఈ కమిటీలో నలుగురు సభ్యులు 35 బేసిస్ పాయింట్లు వడ్డీకోతకు అనుకూలంగా స్పందించగా.. ఇద్దరు సభ్యులు 25 బేసిస్​ పాయింట్లకు మొగ్గు చూపారు.

తాజా సవరణతో రిజర్వు బ్యాంకు ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణంపై వడ్డీ రేటు (రెపో) 5.40 శాతానికి చేరింది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు (రివర్స్ రెపో రేటు)ను 5.15 శాతంగా నిర్ణయించింది రిజర్వు బ్యాంకు.

వడ్డీ కోత ఎందుకంటే?

ఆర్బీఐ అంచనాలకు తగ్గట్లుగానే ద్రవ్యోల్బణం ఉండటం.. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, ప్రపంచ వృద్ధి మందగమనం వంటి కారణాలు వడ్డీ కోతకు ప్రధాన కారణమని ఆర్బీఐ పేర్కొంది. రెపో రేటు తగ్గించడం వరుసగా ఇది నాలుగో సారి.

జీడీపీ అంచనా తగ్గింపు

వాణిజ్య యుద్ధం, ప్రపంచ వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 6.6 శాతం మధ్య నమోదు కావచ్చు. రెండో అర్ధ భాగంలో 7.3 శాతం నుంచి 7.5 శాతంగా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది.

నిరంతరాయంగా నెఫ్ట్​ సేవలు

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు డిసెంబర్ నుంచి నెఫ్ట్​​.. 24 గంటలపాటు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటింటింది ఆర్బీఐ. ప్రస్తుతం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నెఫ్ట్​ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​పై సౌదీ యువరాజుతో ఇమ్రాన్ చర్చలు

ABOUT THE AUTHOR

...view details