క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ (Auditing in India) సమర్థంగా, నిష్పాక్షికంగా చేపట్టడం అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das news) పేర్కొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.
"పబ్లిక్ ఫైనాన్స్ ఆడిటింగ్ నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వాలు వ్యయాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఆడిట్ నాణ్యత పెరగాల్సిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న ప్రతికూలతల నేపథ్యంలో ఆడిటింగ్ కీలకం కానుంది. ప్రస్తుత పోకడలకు అనుగుణంగా ఆడిటర్లందరూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి."
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్