తెలంగాణ

telangana

ETV Bharat / business

పాత నోట్లు, నాణేలు​ పేరుతో మోసాలు- ఆర్​బీఐ వార్నింగ్ - ఆర్​బీఐ నకిలీ ఆఫర్లపై హెచ్చరిక

తమ పేరు, లోగోను అక్రమంగా వాడుకుని మోసాలు జరుగుతున్నట్లు ఆర్​బీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజల నుంచి ఆర్​బీఐ నేరుగా ఎలాంచి ఛార్జీలు, ట్యాక్స్​లు వసూలు చేయదని స్పష్టం చేసింది.

Fraudsters Using RBI Name for Financial Scams
ఆర్​బీఐ పేరుతో మోసాలు

By

Published : Aug 4, 2021, 2:47 PM IST

Updated : Aug 4, 2021, 5:07 PM IST

ప్రజలకు.. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆర్​బీఐ పేరును ఉపయోగించుకుని వచ్చే నకిలీ ఆఫర్లు, ఛార్జీలు, ట్యాక్స్​ల వలలో పడి మోసపోవద్దని సూచించింది.

ఆర్​బీఐ ఎలాంటి ఆఫర్లు ఇవ్వదని స్పష్టం చేసింది. ఆర్​బీఐ పేరును వాడుకుని ఆఫర్లు ఇవ్వడం, ఛార్జీలు వసూలు చేయడం వంటి అధికారాలు కూడా ఎవరికీ లేవని వివరించింది.

ఆన్​లైన్​, ఆఫ్​లైన్ ప్లాట్​ఫామ్స్​ ద్వారా పాత నోట్లు/కాయిన్ల కొనుగోలు, విక్రయానికి సంబంధించి ఛార్జీలు, కమీషన్​, ట్యాక్స్​ల పేరుతో మోసాలు జరుగుతున్నట్లు ఆర్​బీఐ తెలిపింది. ఈ మోసాలకు ఆర్​బీఐ పేరు, లోగోలను అక్రమంగా వినియోగించుకుంటున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:Shortcuts in Gmail: జీమెయిల్‌ను 'అన్‌డూ' చేసేయండి!

Last Updated : Aug 4, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details