తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.57 వేల కోట్లు - RBI news

కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఏడాదిలో రూ.57 వేల కోట్లను డివిడెండ్​ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపింది ఆర్​బీఐ బోర్డు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

Centre to receive Rs 57,128 crore from RBI as FY20 surplus
ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.57 వేల కోట్లు

By

Published : Aug 14, 2020, 6:56 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.57వేల కోట్లను డివిడెండ్‌ రూపంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చెల్లించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది.

కరోనా కారణంగా ఆదాయం భారీగా పడిపోయిన వేళ ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. వాస్తవానికి ఆర్‌బీఐ సహా, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఈ ఏడాది రూ.60వేల కోట్ల మేర వస్తాయని బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది.

కరెన్సీ ట్రేడింగ్‌, బాండ్ల ట్రేడింగ్‌ నుంచి ఆర్‌బీఐ భారీగా ఆదాయం పొందుతోంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. ఈ విధంగా గతేడాది రూ.1.76 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించింది. నిధులు నిండుకునే పరిస్థితి నెలకొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐపై ఆధారపడుతూ వస్తోంది. ఈ క్రమంలో మధ్యంతర డివిడెండ్ కోరుతుంటుంది. దీంతో పలుమార్లు ఆర్‌బీఐ మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తుంటుంది.

ఇదీ చూడండి:పంద్రాగస్టుకు మోదీ కీలక ప్రకటన- వ్యాక్సిన్​పైనేనా?

ABOUT THE AUTHOR

...view details