తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రత్యేక ఓఎంఓ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల వేలం - ఆర్​బీఐ ఓఎంఓకు 20 వేల కోట్లు

రూ.20 వేల కోట్లు విలువైన‌ ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను కొనుగోలుతోపాటు అదేస‌మ‌యంలో విక్ర‌యించ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. ఆగస్టు 27, సెప్టెంబర్ 3 తేదీల్లో రెండు దఫాల్లో ఈ వేలం నిర్వహించనుంది ఆర్​బీఐ.

purchase and sale of government securities
ఆర్​బీఐ ఓఎంఓకు 20 వేల కోట్లు

By

Published : Aug 25, 2020, 1:01 PM IST

ప్రత్యేక ఓపెన్​ మార్కెట్ ఆపరేషన్ (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, విక్రయాలను ఏకకాలంలో చేపట్టాలని నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ప్రకటించింది. ఇందులో మొత్తం రూ.20 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను రెండు దఫాల్లో వేలం వేయనున్నట్లు వెల్లడించింది.

ఆగస్టు 27న తొలి దఫాలో రూ.10 వేల కోట్లు విలువైన నాలుగు సెక్యూరిటీలను విక్రయించి.. అంతే మొత్తంలో నాలుగు సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 3న రెండో దఫా వేలం నిర్వహించనుంది రిజర్వు బ్యాంక్.

మార్కెట్ల ప‌రిస్థితి, ద్ర‌వ్య ల‌భ్య‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ మ‌ళ్లీ ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.

ఇదీ చూడండి:వ్యూహాత్మక దిద్దుబాటు.. సంస్కరణల బాటలో పీఎస్​బీలు

ABOUT THE AUTHOR

...view details