దేశంలో విద్యుత్ డిమాండ్ శుక్రవారం సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిసారి 187.3 గిగా వాట్ల డిమాండ్ నమోదైనట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇంతకు ముందు ఇదే నెల 20న.. 1,85,820 మెగావాట్లుగా విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు తెలిపింది. తాజాగా ఇది 1,87,300 మెగా వాట్ల మార్క్‌ను (ఉదయం 10:20 ప్రాంతంలో) తాకినట్లు వివరించింది. గత ఏడాది నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 182.89 గిగా వాట్లను వెల్లడించింది.