ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వివిధ వర్గాల నిపుణులతో మోదీ కొద్ది రోజులుగా మేధోమథన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'బడ్జెట్‌పై మోదీ జరుపుతున్న విస్తృత సంప్రదింపులన్నీ తన ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు, సంపన్న వర్గాల కోసమే. మన రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల అభిప్రాయాలు, ఆలోచనలపై ఆయనకు ఎలాంటి ఆసక్తి ఉండదు’ - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత