'పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తెస్తే.. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్కు రూ.75 దిగువకు చేరుతుంది. డీజిల్ రూ.68 కన్నా తక్కువకు లభిస్తుంది' అని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు రాయకీయ నేతలు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు.
రాజకీయపరంగా దృఢ సంకల్పం లేకపోవడం వల్లే.. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం రూ.లక్ష కోట్లు (జీడీపీలో 0.4 శాతం మాత్రమే) ఆదాయం తగ్గుతుందని అంటున్నారు విశ్లేషకులు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లు, రూపాయి మారకం విలువ 73 వద్ద ఉదాహరణగా తీసుకుని ఈ అంచనాలు వేశారు.
ప్రస్తుతం రాష్ట్రాలు సొంతంగా చమురుపై పన్నులు విధిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రం కూడా సుంకాలు, సెస్సు వసూలు చేస్తోంది. ఈ కారణంగా పెట్రోల్ ధర లీటర్కు పలు ప్రాంతాల్లో రూ.100 మార్క్ దాటింది.