కుటుంబ అత్యవసరాల కోసం లేదా అధిక రాబడులు ఇచ్చే సాధానాల్లో మదుపు చేసేందుకు.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమ పెన్షన్ నిధి మొత్తాన్ని ఓకే సారి విత్డ్రా చేసుకునేందుకు త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఎన్పీఎస్ నుంచి విత్ డ్రాపై రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. ఇది కాకుండా మొత్తం పెన్షన్ నిధిలో 60 శాతం మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు వీలుంది. 40 శాతం ఫండ్ కచ్చితంగా ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో ఉండాల్సిందే.