తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రయాణ వాహనాలు అమ్మకాల జోరుకు బ్రేకులు - undefined

ప్రయాణ వాహనాలకు డిమాండ్​ తగ్గుదలతో ప్రధాన వాహన కంపెనీల అమ్మకాల్లో వృద్ధి అంచనా కంటే తక్కువగా నమోదైంది.

ప్రయాణ వాహనాలు అమ్మకాల జోరుకు బ్రేకులు

By

Published : Apr 2, 2019, 8:21 AM IST

2018-19లో 9 నెలల పాటు ప్రయాణ వాహనాలకు డిమాండ్​ పడిపోగా... అన్ని కంపెనీల వాహనాల అమ్మకాల్లో వృద్ధి అంచనాల కంటే తక్కువగా నమోదైంది. మారుతి సుజుకీ, హుందాయ్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, హోండా, టయోటా కంపెనీలు వృద్ధి 10 శాతం లోపే ఉంది.

అందుకోలేకపోయిన మారుతి..

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా(ఎమ్​ఎస్​ఐ) 4.7 శాతం వృద్ధితో 2018-19లో 18.62 లక్షల కార్లను విక్రయించింది. ఒక సంవత్సరం అమ్మకాల పరంగా ఇదే గరిష్ఠం. 2017-18లో ఈ అమ్మకాలు 17.79 లక్షలుగా ఉన్నాయి. అయితే డిసెంబర్​లో సవరించిన 8 శాతం అంచనానూ అందుకోలేకపోయింది మారుతి.

దేశీయంగా సంవత్సరం అమ్మకాల్లో కొత్త రికార్డును నెలకొల్పింది ఎమ్​ఎస్​ఐ. 6.1 శాతం వృద్ధితో 17.53 లక్షల కార్లు విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 16.53 లక్షలుగా ఉంది.

ఇతర కంపెనీల పరిస్థితి ఇదే...

హుందాయ్​ 2018-19లో 2.5 శాతం వృద్ధితో 7.07 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య 2017-18లో 6.90 లక్షలుగా ఉంది.

మహీంద్రా 2 శాతం వృద్ధితో 2.54 లక్షల యునిట్లు విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 2.49 లక్షలు. భారత ఆటోమొబైల్​ పరిశ్రమ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్నింటినీ కలిపినప్పుడు 11 శాతం వృద్ధి నమోదుచేసినట్లు ఎమ్​ అండ్​ ఎమ్​ అధ్యక్షుడు తెలిపారు.

హోండా కార్స్​ ఇండియా 8 శాతం వృద్ధితో 1.83 లక్షల వాహనాలను విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 1.70 లక్షలుగా ఉంది. హోండా 4,794 కార్లు ఎగుమతి చేసింది.

2017-18లో 1.41 లక్షల కార్లు అమ్మిన టయోటా మోటార్స్​ 7 శాతం వృద్ధితో 2018-19లో 1.50 లక్షల యునిట్లు విక్రయించింది.

ద్విచక్ర వాహనాలు...

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​ 78.20 లక్షల బైకులు విక్రయించినట్లు ప్రకటించింది. 2017-18లో ఈ సంఖ్య 75.87 లక్షలు.

సుజుకీ మోటార్​ సైకిల్స్​ 30 శాతం వృద్ధితో 7.47 లక్షల వాహనాలను విక్రయించింది. ఒక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య పరంగా ఇదే గరిష్ఠం. అంతకుముందు ఏడాదిలో 5.74 లక్షల వాహనాలను విక్రయించింది సుజుకీ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details