తెలంగాణ

telangana

ETV Bharat / business

అప్పడం రౌండ్​గా లేకపోతే జీఎస్​టీ కట్టాలా? - అప్పడాలపై జీఎస్​టీపై హర్ష గొయెంకా ట్వీట్​

'అప్పడాలు గుండ్రంగా ఉంటే జీఎస్​టీ వర్తించదు ఎందుకు? చతురస్రాకారంలో ఉంటే జీఎస్​టీ (GST on Papad) చెల్లించాలా? ఇదేం లాజిక్​?' అంటూ సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంతకీ ఈ చర్చకు కారణాలు ఏమిటి? నిజంగానే అప్పడాలు జీఎస్​టీ (Papad GST rate) పరిధిలోకి వస్తాయా?

Papad
అప్పడాలు

By

Published : Sep 2, 2021, 10:36 AM IST

అప్పడాలపై జీఎస్​టీ(GST on Papad)! నిజమా అప్పడాలు జీఎస్​టీ పరిధిలోకి వస్తాయా? ఇంతకీ వాటిపై జీఎస్​టీ ఎంత(Papad GST rate)? చతురస్రాకారంలో ఉన్న అప్పడాలకు మాత్రమే జీఎస్​టీ వర్తిస్తుందా? గుండ్రంగా ఉంటే జీఎస్​టీ చెల్లించాల్సిన అవసరం లేదా? ఇవన్నీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సందేహాలు. వీటన్నింటికీ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గొయెంకా చేసిన ఓ ట్వీట్​ ప్రధాన కారణం.

"చతురస్రాకారంలో ఉన్న అప్పడంపై జీఎస్​టీ వేస్తున్నారు. రౌండ్​గా ఉన్న అప్పడాలకు జీఎస్​టీ మినహాయింపు. ఇందులో ఉన్న లాజిక్​ నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా మంచి ఛార్టర్డ్ అకౌంటెంట్‌ అదేమిటో కాస్త వివరించండి."

-హర్షా గొయెంకా, ఆర్​పీజీ ఎంటర్​ప్రైజెస్​ ఛైర్మన్​

ఆయన ఇటీవలే ఈ ట్వీట్​ చేయగా.. సోషల్​ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించారు. కొందరు నవ్వుకునే కారణాలు చెప్పగా.. మరికొందరు వింత లాజిక్​లు చెప్పారు. ఈ చర్చను గమనించిన.. కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు​ (సీబీఐసీ) హర్షా గొయెంకా ట్వీట్​కు సమాధానమిచ్చింది.

ఆకారంతో సంబంధం లేకుండా అప్పడం ఏదైనా జీఎస్​టీ నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది సీబీఐసీ. జీఎస్​టీ నోటిఫికేషన్‌ No.2/2017-CT(R)లోని No.96లో ఈ విషయం పేర్కొన్నట్లు తెలిపింది. సంబధిత నోటిఫికేషన్‌ cbic.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్​- కొవిడ్​ నుంచి తేరుకున్నట్టేనా?

ABOUT THE AUTHOR

...view details