తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే! - ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే!

శాశ్వత ఖాతా సంఖ్యను(పాన్​ నెంబర్​) ఆధార్​తో అనుసంధానం చేయాలని దేశప్రజలకు మరోసారి సూచించింది ఆదాయ పన్ను విభాగం. లేదంటే మార్చి 31తర్వాత పాన్​ నెంబర్ పనిచేయదని వెల్లడించింది. ఇప్పటికే పలుమార్లు గడువు తేది పెంచామని, చివరగా 2020 మార్చి 31తో ఆ గడువు ముగుస్తుందని తెలిపింది.

PAN to become inoperative,if not linked with Aadhaar
ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే!

By

Published : Feb 15, 2020, 5:43 AM IST

Updated : Mar 1, 2020, 9:30 AM IST

ఆధార్​తో అనుసంధానించకపోతే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్​ నెంబర్) పనిచేయదని తేల్చింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ). ఒకవేళ అనుసంధానించనట్లయితే మార్చి 31 తర్వాత పాన్​ నెంబర్ పనిచేయదని తెలిపింది. ఈ ప్రక్రియకు ఇప్పటికే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చామని.. ప్రస్తుత గడువు తేది మార్చి 31తో ముగియనుందని వెల్లడించింది.

2020, జనవరి 27 నుంచి ఇప్పటివరకు 30.75 కోట్ల పాన్​ కార్డులు ఆధార్​తో అనుసంధానించారు. అయితే 17.58 కోట్ల కార్డులు ఇప్పటికీ అనుసంధానం కాలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఆదాయపన్ను నిబంధనలకు సవరణలు చేపట్టిన సీబీడీటీ.. 114ఏఏఏ సెక్షన్​ను చేర్చింది. పాన్​ పనిచేయకుండా ఉండే విధంగా నిబంధనలను ఈ సెక్షన్​లో ఉటంకించింది.

బాధ్యులు వారే!

ఆధార్ అనుసంధానించని వ్యక్తులు తర్వాత జరగబోయే పరిణామాలకు బాధ్యత వహిస్తారని ఆదాయ పన్ను ప్రకటనలో పేర్కొంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్​ 139ఏఏ(2) ప్రకారం 2017, జూన్​1 లోపు పాన్ పొందిన వారు తప్పనిసరిగా ఆధార్​ను అనుసంధానం చేయాలని సూచించింది.

ఆధార్​ను రాజ్యాంగబద్ధం చేస్తూ, తప్పనిసరిగా పాన్​తో అనుసంధానించాలని సుప్రీంకోర్టు 2018లో ప్రకటించింది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ ఈ ప్రక్రియ చేపట్టింది.

ఇదీ చూడండి:కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని జరిమానా!

Last Updated : Mar 1, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details