డిసెంబర్ 26 వరకు మొత్తం 4.15 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే డిసెంబర్ 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగా దాఖలు చేయడం ఉత్తమం అని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఐటీఆర్లకు సంబంధించిన వివరాలను ఈమేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
మొత్తం 4.15 కోట్ల మందిలో ఐటీఆర్-1కు 2.34 కోట్ల మంది, ఐటీఆర్-4కు 89.89 లక్షల మంది, ఐటీఆర్-3కి 49.72 లక్షల మంది, ఐటీఆర్-2కి 30.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.