తెలంగాణ

telangana

ETV Bharat / business

కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. కిలో ధర రూ.200! - తమిళనాడు మధురైలో కిలో రూ. 200

అమ్మో.. ఉల్లి! ఇది ప్రస్తుతం దేశంలో సామాన్యుడి మాట. కమ్మని భోజనం తిని ఎన్నాళ్లయిందో ఇదీ వారి ఆవేదన. అదేనండీ.. కోసేటప్పుడు జనాలను ఏడిపించే ఉల్లి.. ఇప్పుడు కొనేటప్పుడూ ఏడిపిస్తోంది. తాజాగా తమిళనాడులో కిలో ఉల్లి రూ.200 ధర పలుకుతుంది.

Onions being sold for Rs 200 in Madurai tamilnadu
కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. కిలో ధర రూ.200

By

Published : Dec 8, 2019, 11:18 AM IST

తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే.. కాస్త ట్రెండ్​ మార్చి కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగుతినేలా చేస్తోంది. తమిళనాడు మధురైలో కిలో రూ. 200లకు చేరుకుని ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.

'5 కిలోలు కొనడానికి వచ్చే వినియోగదారులు.. కేవలం ఒక్క కేజీ కొనుక్కుని వెనుదిరుగుతున్నారు.' అంటున్నారు ఉల్లి వ్యాపారులు. ఇక వారానికి కేవలం ఉల్లి కొనుగోలు కోసం రూ.350 నుంచి 400 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు వినియోగదారులు.

పంట దిగుబడి తగ్గిపోయి సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది ఉల్లి. గత కొద్ది రోజులుగా దేశంలో ఎటు చూసినా ఉల్లి లొల్లి వినిపిస్తూనే ఉంది.

ఇదీ చదవండి:దేశంలోనే తొలి ట్రాన్స్​జెండర్​ అటవీ అధికారిగా దీప్తి!

ABOUT THE AUTHOR

...view details