తెలంగాణ

telangana

ETV Bharat / business

'2020-21లో జీడీపీ వృద్ధి రేటు 10 శాతం' - బడ్జెట్ వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించినా.. 2020-21లో భారీగా పుంజుకుంటుందని బడ్జెట్​లో అంచనా వేశారు నిర్మలా సీతారామన్​. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.30.42 లక్షల కోట్ల వ్యయాల అంచనా లెక్కగట్టారు.

budget
బడ్జెట్​

By

Published : Feb 1, 2020, 4:48 PM IST

Updated : Feb 28, 2020, 7:03 PM IST

రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి పెరుగుతుందని బడ్జెట్​లో అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20).. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.8 శాతం నుంచి 3.5 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి​. 2020-21లోనూ 3.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన మధ్యంతర సలహాలు స్వీకరించామన్నారు. కమిషన్ పూర్తి నివేదిక ఈ ఏడాది చివర్లో అందించే అవకాశముందని పేర్కొన్నారు.

వ్యయాలు, ఖర్చుల లెక్కలు..

ఆర్థిక సంవత్సరం వ్యయం ఆదాయం నికర మార్కెట్​ రుణాలు
2020-21(అంచనా) రూ.30.42 లక్షల కోట్లు రూ.22.46 లక్షల కోట్లు రూ.5.36 లక్షల కోట్లు
2019-20 (సవరణ) రూ.26.99 లక్షల కోట్లు రూ.19.32 లక్షల కోట్లు రూ.4.99 లక్షల కోట్లు

ఇదీ చూడండి:'ఆ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులతో ఉపాధి సృష్టి'

Last Updated : Feb 28, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details