తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 1:50 PM IST

ETV Bharat / business

'రుణాల పునర్​వ్యవస్థీకరణకు అంత డిమాండ్ లేదు'

రుణాల పునర్​వ్యవస్థీకరణ సదుపాయం వినియోగించుకునేందుకు.. మార్కెట్ వర్గాలు అంచనా వేసినంత డిమాండ్ లేదని ఎస్​బీఐ ఛైర్మన్ వెల్లడించారు. రుణాల పునర్​వ్యవస్థీకరణ ప్రస్తుతం రూ.25 కోట్ల కన్నా ఎక్కువ.. రూ.400 కోట్లకన్నా తక్కువ రుణాలు ఉన్న కార్పొరేట్లు మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.

SBI Chairman on restructuring of loans
రుణాల పునర్​వ్యవస్థీకరణపై ఎస్​బీఐ ప్రకటన

కరోనా నేపథ్యంలో రుణగ్రహీతలపై(రిటైల్, కార్పొరేట్) ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో రుణాల పునర్‌వ్యవస్థీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతిచ్చినా.. మార్కెట్ వర్గాలు​ అంచనా వేసినంతగా డిమాండ్ మాత్రం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఛైర్మన్ రజనీశ్​ కుమార్ వెల్లడించారు.

మొత్తం రూ.8 లక్షల కోట్లకుపైగా రుణాల పునర్​వ్యవస్థీకరణకు వీలున్నప్పటికీ.. దానిని వినియోగించుకునే మొత్తం రూ.1.5 లక్షల కోట్లకు మించకపోవచ్చని తెలిపారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నట్లు రజనీశ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. పునర్​వ్యవస్థీకరణ అవసరం అల్ప స్థాయిలో ఉన్న కార్పొరేట్లకు, ఎగువ స్థాయిలో ఉన్న ఎంఎస్​ఎంఈలకు మాత్రమే అధికంగా ఉన్నట్లు వివరించారు.

రూ.25 కోట్ల కన్నా ఎక్కువ.. రూ.400 కోట్ల కన్నా తక్కువ రుణాలున్న వారు మాత్రమే రుణాల పునర్​వ్యవస్థీకరణకు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నట్లు రజనీశ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం బ్యాంకులకు మూలధన, పరిపాలన, ఎన్​పీఏల సమస్య ప్రధానంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు రజనీశ్ కుమార్.

ఇదీ చూడండి:రుణాల పునర్​వ్యవస్థీకరణకుపై మరింత సమచారానికి ఇక్కడ క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details