తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త పన్ను విధానంతో రిటర్నులు మరింత సులభతరం - New Tax slabs in India

ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లు ఇకపై నిపుణుల సాయం అవసరం లేకుండా ఎవరి పన్నును వారే దాఖలు చేసుకునే వీలుకలగనుంది. అంతేకాకుండా తక్కువ వడ్డీ రేట్లు.. పీపీఎఫ్​, బీమా పెట్టుబడుల అవసరం లేకుండానే పన్ను ప్రయోజనాలనూ క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఇలా మరిన్ని సులభతర సౌకర్యాలను కల్పిస్తూ.. కేంద్రం ఇటీవలి బడ్జెట్​లో కొత్త  అదాయపు పన్ను విధానాన్ని రూపొందించింది. ఇంతకీ ఆ కొత్త పన్ను విధానమేంటి? వాటితో ఎలాంటి ఉపయోగాలు కలగనున్నాయి? పూర్తి వివరాలు మీ కోసం..

New simplified income tax
కొత్త పన్ను విధానంతో రిటర్నులు మరింత సులభతరం

By

Published : Feb 10, 2020, 8:09 AM IST

Updated : Feb 29, 2020, 7:59 PM IST

కొత్త సరళీకృత ఆదాయపు పన్ను రేట్లను ఎంచుకునే వారికి ఐటీఆర్ దాఖలు చేయడానికి నిపుణుల‌ సేవలు అవసరం ఉండకపోవచ్చు. పన్ను చెల్లింపుదారులకు పన్ను తగ్గింపుతో సహా, కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల మరో ప్రయోజనం ఉంటుంది. కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానంతో, తక్కువ రేట్లతో పాటు, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి మీకు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా మరే ఇతర ప్రొఫెషనల్ సహాయం అవసరం లేదు.

ఇదివ‌ర‌కు వివిధ మినహాయింపులు, తగ్గింపులతో ముడిప‌డి ఉన్న‌ ఆదాయపు పన్ను చట్టం చాలా మంది పన్ను చెల్లింపుదారులకు వృత్తిపరమైన సహాయం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేస్తుంది.

మరింత సరళీకృతం...

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో.. పన్ను చెల్లింపుదారులకు ఐచ్ఛికంగా కొత్త ఆదాయపు పన్ను పాలనను ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను చట్టాలను పాటించేందుకు ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు భారంగా మారింద‌ని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆదాయ పన్ను విధానం, పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడమే కాకుండా, పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి పీపీఎఫ్, బీమా పెట్టుబ‌డులు లేన‌ప్ప‌టికీ వీలుంటుంది.

నిపుణుల సాయం లేకుండానే...

మీరు తగ్గింపులు, మినహాయింపుల గ‌ణాంకాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు కాబట్టి పన్నును లెక్కించడం, ఐటీఆర్ ఫారంల‌ను నింపడం కూడా సులభం అవుతుంది. కొత్త ఆదాయపు పన్ను శ్లాబురేట్లను ఎంచుకునే వారికి ముందుగా నింపిన ఐటీఆర్ లభిస్తుందని, అందువల్ల నిపుణుల సహాయం లేకుండానే రిటర్నులు దాఖలు చేయవచ్చని సీతారామన్ ప్రకటించారు.

ఈ ఏప్రిల్ 1 నుంచి మీరు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ మీ ఐటీఆర్‌ను దాఖలు చేసేట‌ప్పుడు, పన్ను చెల్లింపుదారులందరికీ రెండు ఆదాయపు పన్ను నిబంధనలలో దేనినైనా ఎన్నుకునే అవ‌కాశం లభిస్తుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు.

ఈ-ఫైలింగ్​ పోర్టల్​లో 'ఐటీఆర్'​ ఫారం...

కొత్త ఆదాయపు పన్ను శ్లాబురేట్లను ఎంచుకునే వారికి ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం లభిస్తుంది. అందులో చాలా వివరాలు ముందే ఉంటాయి. ఆ తర్వాత మీరు మీ రిటర్నుల‌ను సులభంగా దాఖలు చేయవచ్చన్నారు.

ఐటీ విభాగం ఇప్పటికే వచ్చే ఏడాది ఐటీఆర్-1 (సహజ్) ఫారంను విడుదల చేసింది. ఇది సంవత్సరంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వేత‌న జీవుల‌కు వ‌ర్తిస్తుంది. ఐటీఆర్-4 (సుగ‌మ్‌) వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థ‌లు (ఎల్‌ఎల్‌పీ కాకుండా) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న‌వారు దాఖ‌లు చేయాలి.

ఇదీ చదవండి: 'ఈ-క్యాలిక్యులేటర్'​తో మీ పన్ను ఎంతో తెలుసుకోండి

Last Updated : Feb 29, 2020, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details