2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్లో సవరించిన అంచనాలకన్నా పన్ను వసూళ్లు 5 శాతం ఎక్కువగా నమోదైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10 శాతం తక్కువగా నమోదైనట్లు పేర్కొంది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లు @ రూ.9.45లక్షల కోట్లు - ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం జంప్
గత ఆర్థిక సంవత్సరం (2020-21) అంచనాలకు మించి ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే.. పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ.9.45 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శుక్రవారం ప్రకటించింది.
పెరిగిన పన్ను వసూళ్లు
మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ల వాటా రూ.4.57 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్నుల ద్వారా రూ.4.71 లక్షల కోట్లు వసూలైనట్లు సీబీడీటీ వెల్లడించింది. మిగతా రూ.16,927 కోట్లు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)గా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు ఇంకా భారీగా పెరగొచ్చని అంచనా వేసింది సీబీడీటీ.
ఇదీ చదవండి:ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు భారత్ సిద్ధం!
Last Updated : Apr 9, 2021, 2:34 PM IST