నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ శనివారం (మే 22) అర్ధరాత్రి 12:01 గంటల నుంచి ఆదివారం (మే 23) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
నెఫ్ట్ వ్యవస్థ అప్‌గ్రేడింగ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది.