కరోనా కారణంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశవ్యాప్తంగా రహదారుల ప్రాజెక్టును వెంటనే పునఃప్రారంభించాలన్నారు. సంబంధిత అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు గడ్కరీ. దేశవ్యాప్తంగా 20లక్షల మంది వలస కార్మికులున్నారని, పనులు ప్రారంభిస్తే వారికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుందని స్పష్టం చేశారు గడ్కరీ. రాహదారుల విభాగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఎర్పాటు చేసినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలన్నారు. రూ.లక్ష కోట్లు విలువ చేసే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేతో రాజస్థాన్‌లోని వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.