కొన్ని ప్రధాన సంస్థల సంక్షోభం, రుణ భారం కారణంగా త్వరలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ రంగం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్ ఇటీవల ఓ ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పెద్ద సంస్థలు చేసిన పొరపాట్లు, రుణ భారంలో చిక్కుకున్న మరికొన్ని సంస్థల కారణంగా నాన్ బ్యాంకింగ్ రంగాలు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా ఐఎల్&ఎఫ్ఎస్ సహా పలు ఇతర సంస్థల సంక్షోభం ఇందుకు కారణమని పేర్కొన్నారాయన. ఆయా సంస్థల ఆస్తులు, అప్పులు దాదాపు సమంగా ఉండటం కూడా ఇందుకు మరింత ఊతమందిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఎటువంటి గడ్డుపరిస్థితుల్లోనైనా "బాధ్యతాయుతమైన" కొన్ని కంపెనీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోని కార్పొరేట్ అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించినట్లు తెలిపారు.