కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్-19 భయాలతో భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్. 2020లో భారత వృద్ధి రేటు 5.3 శాతానికి పరిమితం కావొచ్చని లెక్కగట్టింది. గత నెల విడుదల చేసిన అంచనాల్లో ఈ రేటును 5.4 శాతంగా ఉంచింది.
2020కి గాను మొదట 6.6 శాతంగా వృద్ధి రేటు అంచనా వేసింది మూడీస్. అయితే పలు అనిశ్చితుల నడుమ వరుసగా అంచనాలను తగ్గిస్తూ వస్తోంది. గత ఏడాది (2019) 5.3 శాతంగానే వృద్ధి రేటు అంచనాలు ఉండగా.. 2018లో 7.4 శాతం వృద్ధి రేటు సాధించింది భారత్.
ఇదే సమయంలో.. 2021లో భారత్ 5.8 వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది మూడీస్.