అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం తీసుకుంటున్న వాళ్లు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్‌ధన్ యోజన స్కీమ్‌కు అర్హులు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినవారు ఇందులో పేరు నమోదు చేసుకోవచ్చు. ఇది స్వచ్ఛంద పెన్షన్ పథకం.. దీని ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు. 50:50 నిష్పత్తిలో చందాదారుడు ఎంత జమ చేస్తే, అంతే సమానంగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద చందాదారుడికి 60 ఏళ్లు వచ్చాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ పొందుతాడు. 60 ఏళ్ల కంటే ముందే మరణిస్తే వారి భార్య లేదా భర్త ఈ పథకాన్ని కొనసాగించొచ్చు.
ఎలా నమోదు చేసుకోవాలి..?
అర్హత ఉన్న చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌సీ)లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సెంటర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తుంది. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ ఉండాలి. దేశవ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్‌సీ సెంటర్లలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది.
ఉపసంహరణ నియమాలేంటి...?