భారతదేశ స్వయం సమృద్ధి సాధన కోసం 'ఆత్మ నిర్భర్ భారత్' పేరిట ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మంచి ప్రయత్నమని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్). దీనికి సంబంధించి ఆ సంస్థ ఉన్నతాధికారి గెర్రీ రైస్ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రకటించిన ప్యాకేజీ.. ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చిందని, భారీ నష్టాలను తగ్గించిందని ఆయన ప్రశంసించారు.
" 'మేక్ ఫర్ ది వరల్డ్' లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేసే విధానాలపై దృష్టిపెట్టాలి. మోదీ చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రముఖ పాత్ర పోషించాలంటే.. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని మెరుగుపరిచి, ఉత్తేజమైన విధానాలను అనుసరించడం చాలా అవసరం"