తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 8:36 AM IST

ETV Bharat / business

ఈ నెల 9న మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ భేటీ

దేశ ఆర్థికవ్యవస్థను బలపరిచే దిశగా నీతి ఆయోగ్​ అధికారులతో చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 9న ఈ సమావేశం జరగనుంది.

modi
ఈ నెల 9న నీతి అయోగ్​ నిపుణులతో మోదీ భేటి

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 9న నీతి ఆయోగ్​ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్​ వైస్​ చైర్మన్​ రాజీవ్​ కుమార్​, సీఈఓ అమితాబ్​ కాంత్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్​ ఉన్నతాధికారులతో గురువారం

సమావేశం కానున్నారు. "

-సీనియర్​ ప్రభుత్వాధికారి.

2020-21 కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మోదీతో దిగ్గజ పారిశ్రామికవేత్తలుసోమవారంభేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, వృద్ధిని పెంచడానికి, ఉద్యోగాల కల్పితాలకు అవసరమైన చర్యలపై పరస్పర చర్చలు జరిగాయి.

మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్తను బలపరిచే దిశగా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి : 'ఎయిర్​ ఇండియాను మూసేయడం లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details