అమెరికాలోని పలు టెక్ కంపెనీలు (Microsoft results) త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్ 17 శాతం మేర నికర లాభం పెరిగినట్లు మంగళవారం వెల్లడించగా.. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ, వాషింగ్టన్ రేడ్మండ్ కేంద్రంగా నడిచే మైక్రోసాఫ్ట్ (Microsoft results 2021) 24 శాతం మేర అధిక లాభాలను ఆర్జించింది. వాల్ స్ట్రీట్ అంచనాలను మించి.. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో (Microsoft results today) 17.2 బిలియన్ డాలర్ల లాభం పొందినట్లు పేర్కొంది.
మొత్తం 45.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 22 శాతం అధికమని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి విజృంభణతో.. సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు డిమాండ్ పెరిగిందని ఇదే లాభాలకు ప్రధాన కారణమని సంస్థ(Microsoft results 2021) ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసెస్ వంటివి కూడా ఎంతో ఉపకరించాయని(Microsoft results) వెల్లడించింది.
అల్ఫాబెట్..