తెలంగాణ

telangana

ETV Bharat / business

మాల్యా, నీరవ్​ కేసుల్లో నేడు కీలక నిర్ణయాలు! - లండన్​

అప్పగింత ఉత్తర్వులపై మాల్యా చేసిన అప్పీలును నేడు లండన్​ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనానికి కేటాయించనుంది. రెండో బెయిల్​ పిటిషన్​పై వాదనల కోసం వెస్ట్​ మినిస్టర్​ కోర్టుకు నీరవ్​ మోదీ హాజరుకానున్నారు.

విజయ్​ మాల్యా, నీరవ్​​ మోదీ

By

Published : Mar 29, 2019, 9:30 AM IST

Updated : Mar 29, 2019, 10:06 AM IST

విజయ్​ మాల్యా, నీరవ్​​ మోదీ

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ లండన్​లో ఉంటున్న విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీకి సంబంధించి కేసుల్లో నేడు కీలక పరిణామాలు జరగనున్నాయి. అప్పగింత ఉత్తర్వులను సవాలుచేస్తూ మాల్యా దాఖలు చేసిన అప్పీలు​ను హైకోర్టు... న్యాయమూర్తికి కేటాయించనుంది. అప్పీలును స్వీకరించాలా? లేదా? అనేది ఈ న్యాయమూర్తే నిర్ణయించనున్నారు. ఇందుకు నిర్ణీత గడువు లేనప్పటికీ కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడనుంది.

నీరవ్​ మోదీ రెండో బెయిల్​ పిటిషన్​కు సంబంధించిన వాదనల కోసం లండన్​ వెస్ట్​ మినిస్టర్​ కోర్టుకు హాజరుకానున్నారు. మార్చి 19న బ్యాంకు ఖాతా తెరవటానికి ప్రయత్నిస్తున్న ఈ వజ్రాల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు. మెదటిసారి చేసిన బెయిల్​ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

గత నెలలో మాల్యా అప్పగింత ఉత్తర్వు...

వేర్వేరు కేసుల్లో నిందితుడైన మాల్యాను స్వదేశానికి అప్పగించాలని భారత్ అభ్యర్థించింది. ఇందుకు కోర్టు సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సవాలు చేస్తూ మాల్యా పిటిషన్​ దాఖలు చేశారు.

ఇద్దరూ ఇద్దరే...

రూ. 9వేల కోట్ల మేర మోసం, మనీలాండరింగ్​ కేసుల్లో మాల్యా నిందితుడు. పంజాబ్​ నేషనల్​ బ్యాంకును రూ.14 వేల కోట్ల మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Mar 29, 2019, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details